Shivani Rajeshkar: సురేష్ బాబుని ఇంప్రెస్ చేసిన శివాని రాజశేఖర్ సినిమా

admin1
Updated on: 25 Aug 2021 8:01 PM IST
Producer Suresh Babu Impressed With Rajeshkar First Daughter Shivani Debut Telugu Movie Trailer
X

WWW Moive (twitter foto)

Shivani Rajeshkar - Suresh Babu: సీనియర్ హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె అయిన శివాని రాజశేఖర్ త్వరలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక "దొరసాని" సినిమాతో హీరోయిన్ గా మారిపోయినప్పటికి, శివాని మాత్రం ఇంకా తన మొదటి సినిమా ని విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు శివాని అదిత్ అరుణ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. WWW (హూ.. వేర్.. వై..) అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన '118' సినిమాకి దర్శకత్వం వహించిన కె.వి.గుహన్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను చూసిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చాలా ఇంప్రెస్ అయ్యారని, స్వయంగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ సురేష్ బాబు సినిమా చాలా బాగుందని, నెరేషన్ మరియు నటీనటుల పర్ఫామెన్స్ చాలా కొత్తగా ఉన్నాయి అని అన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా మీద ఈ సినిమా ఆధారపడుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు మరియు టీజర్స్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. డాక్టర్ రవి పి రాజు దాట్ల ఈ చిత్రాన్ని రమంత్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story