Suresh Babu: వెబ్ సిరీస్ ను రీమేక్ చేస్తున్న సురేష్ బాబు

Suresh Babu: తాజాగా ఇప్పుడు వెబ్ సిరీస్ లను సైతం రీమేక్ చేయడానికి చూస్తున్నారట సురేష్ బాబు

admin1
Updated on: 1 Sept 2021 1:30 PM IST
Producer Suresh Babu Going to be Remake the Spanish Web Series
X

వెబ్ సిరీస్ ను రీమేక్ చేయబోతున్న సురేష్ బాబు (ఫైల్ ఇమేజ్)

Suresh Babu: ఈమధ్య రీమేకుల హవా బాగానే నడుస్తుంది. ఒక భాషలో సూపర్ హిట్ అయితే అదే సినిమాని మిగతా భాషల్లో రీమేక్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే తాజాగా ఇప్పుడు సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్ కూడా రీమేక్ చేయడానికి సిద్ధమైపోతున్నారు కొందరు. ఇప్పటికే పలు కొరియన్ చిత్రాల రీమేక్ రైట్స్ ను సురేష్ బాబు తీసుకుని పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు వెబ్ సిరీస్ లను సైతం రీమేక్ చేయడానికి చూస్తున్నారట. విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి కి ఈ మధ్యనే ఒక వెబ్ సిరీస్ విపరీతంగా నచ్చేసింది అని సమాచారం. యాక్షన్ సన్నివేశాలు ఉండే సెంటిమెంటల్ స్టోరీ గా నడిచే ఈ స్పానిష్ వెబ్ సిరీస్ వెంకటేష్ ను బాగా ఆకట్టుకుందట.

ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ని వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు రానా వెంకటేష్ కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. దాని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇక ఈ స్పానిష్ వెబ్ సిరీస్ టైటిల్ ఏంటి, అది ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

admin1

admin1

Next Story