Sudhakar Cherukuri: ఆ తప్పులు మళ్లీ రిపీట్ చేయట్లేదు అంటున్నా శర్వానంద్ నిర్మాత

Sudhakar Cherukuri: శర్వానంద్ తాజాగా ఇప్పుడు "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

admin1
Updated on: 3 March 2022 10:49 AM IST
Producer Sudhakar Cherukuri About Sharwanad Aadavallu Meeku Johaarlu Movie | Tollywood News Today
X

Sudhakar Cherukuri: ఆ తప్పులు మళ్లీ రిపీట్ చేయట్లేదు అంటున్నా శర్వానంద్ నిర్మాత

Sudhakar Cherukuri: యువ హీరో శర్వానంద్ తాజాగా ఇప్పుడు "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న సుధాకర్ చెరుకూరి సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

సినిమా కథ మొత్తం జాయింట్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని, 10 మంది ఆడవాళ్ళు ఉన్నా ఆ కుటుంబం లో శర్వానంద్ ఒక్కడే అబ్బాయి అని వాళ్లు చూపించే అతి ప్రేమ తనకి ఇబ్బందులు కలుగ చేస్తూ ఉంటుందని కథను సింపుల్ గా చెప్పారు సుధాకర్. ఇంతమంది నటులతో పనిచేయడం ఎలా ఉంది అని అడగగా ఒక అడ్వెంచర్ లా ఉందని చెప్పుకొచ్చారు.

ఫన్ ఎలిమెంట్స్ మాత్రమే కాక డైరెక్టర్ కిషోర్ తిరుమల ఫ్యామిలీ వాల్యూస్ ని కూడా బాగా హైలైట్ చేశారని అన్న సుధాకర్ చెరుకూరి "పడి పడి లేచే మనసు" సినిమా తర్వాత శర్వానంద్ తో మళ్లీ కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ముందు సినిమాలో చేసిన తప్పులు ఈ సినిమాలో రిపీట్ అవ్వకుండా చూసుకున్నట్లుగా తెలిపారు. ఇక ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని సత్య, వెన్నెల కిషోర్, ప్రదీప్ రావత్ ల పాత్రలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి అని చెప్పారు.

admin1

admin1

Next Story