Neelima Guna: సమంత పడిన కష్టం చాలా ఇన్స్పైరింగ్ అంటున్న నీలిమ

Neelima Guna: అప్పుడు సమంతకి రాషెస్ వచ్చాయి అంటున్నా నిర్మాత

admin1
Updated on: 23 Feb 2022 2:31 PM IST
Producer Neelima Guna Said Samantha Difficulty is Very Inspiring | Telugu Online News
X

సమంత పడిన కష్టం చాలా ఇన్స్పైరింగ్ అంటున్న నీలిమ

Neelima Guna: "ఓ బేబి", "యు టర్న్" వంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలో కనిపిస్తూ అలరిస్తున్న స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు త్వరలో "శాకుంతలం" అనే ఎపిక్ మైతలాజికల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే "శాకుంతలం". ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. తెల్లని చీరతో, పువ్వులను అలంకరించుకొని సమంత ఈ పోస్టర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ సమంత గురించి చెప్పుకొచ్చింది

"కొన్ని కొన్ని సార్లు ఆ ఫ్లోరల్ జువెలరీ వల్ల సమంతా కి ఒంటి నిండా రాషెస్ వచ్చాయి. కానీ తను అలానే మెడిటేషన్ తీసుకొని మళ్లీ వాటిని వేసుకుంది. తనకి చాలా కష్టం అయినప్పటికీ తను అదే డెడికేషన్ తో షూటింగ్ పూర్తి చేసింది. తన కష్టం నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్" అని చెప్పుకొచ్చింది నీలిమ. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి శేఖర్ వి జోసఫ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మలయాళం నటుడు దేవ్ మోహన్, అదితి బాలన్, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story