Natti Kumar: సినిమా ఇండస్ట్రీ అంటే ఆ ఆరుగురేనా.. జన సైనికులపై నట్టి కుమార్ పంచ్ లు

Natti Kumar: పోసాని ఇంటిపైరాళ్ల దాడి సరైన చర్య కాదని నిర్మాత నట్టికుమార్ అన్నారు.

Arun Chilukuri
Published on: 1 Oct 2021 4:59 PM IST
Producer Natti Kumar Slams Janasena Leaders
X

Natti Kumar: సినిమా ఇండస్ట్రీ అంటే ఆ ఆరుగురేనా.. జన సైనికులపై నట్టి కుమార్ పంచ్ లు

Natti Kumar: పోసాని ఇంటిపైరాళ్ల దాడి సరైన చర్య కాదని నిర్మాత నట్టికుమార్ అన్నారు. విమర్శలు చేస్తే రాళ్లదాడులు చేయడం సంస్కారం కాదని పవన్ తన సైనికులను నిలువరించాలనీ కోరారు. దిల్ రాజ్ సారధ్యంలో నిర్మాతల బృందం కలవడాన్ని ఆయన తప్పు బట్టారు. సినిమా ఇండస్ట్రీ అంటే ఆ ఆరుగురేనా అని నిలదీశారు. చిన్న నిర్మాతలను మీటింగులకు పిలవకపోవడం సరికాదన్నారు.

సీఎం జగన్ అందరివాడని అందరినీ ఆదరిస్తారనీ అన్నారు. జనసేన సైన్యం ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తీసుకురావడం సరికాదని, తప్పుదోవ పట్టిస్తున్న నిర్మాతలు, అభిమానులను కాదని పవన్ అసలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఆన్ లైన్ టిక్కట్ల వల్ల వ్యవస్థలో పారదర్శకత ఉంటుందని అన్నారు. ఆన్ లైన్ పోర్టల్స్ టిక్కెట్ల రేట్లు పెంచి ఎక్కువ రేట్లు వసూలు చేస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story