టికెట్ల ధరల గురించి నీకేం తెలుసు..? నానికి నిర్మాత నట్టి కుమార్ కౌంటర్

Sandeep Reddy
Published on: 23 Dec 2021 4:28 PM IST
Producer Natti Kumar Fires on Hero Nani Comments
X

టికెట్ల ధరల గురించి నీకేం తెలుసు.. క్షమాపణ చెప్పాల్సిందే.. నానికి నిర్మాత నట్టి కుమార్ కౌంటర్

Natti Kumar - Nani: థియేటర్స్ కౌంటర్ కంటే కిరాణా కొట్టు కౌంటర్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయని.. టికెట్ రేట్లు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని టికెట్ రేట్లు తగ్గించి ప్రేక్షకులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవమానించిందని హీరో నాని చేసిన వ్యాఖ్యలకు నిర్మాత నట్టి కుమార్ కౌంటర్ ఇచ్చాడు. తాజాగా నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ "నాని గారికి కలెక్షన్ల గురించి ఐడియా ఉందా? షేర్ ఎంత వస్తుంది? ఏంటి అని ఐడియా ఉంటే మాట్లాడాలన్నాడు.

ప్రస్తుతం ఉన్న ధరల మీద పది లక్షల మంది సినిమా చూస్తే 16 కోట్ల షేర్ వస్తోందన్నాడు. నాని గత సినిమాలు విడుదల అయినప్పుడు వంద రూపాయల టికెట్ రేటు ఉంది. కాని ఇప్పుడు రూ.150,200 కూడా ఉన్నాయి. కాని బి,సి సెంటర్లలో తక్కువ ఉన్నాయని మొదటి నుంచి అనుకుంటున్నాం. 5 రూపాయలకు టీ కూడా రాదని అలాగే 35 రూపాయల టికెట్ రేటు ఉండటం అన్యాయమనే ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపాడు.

సమస్య కోర్టులో ఉందని ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సంక్రాంతి పండుగకి విడుదలయ్యే సినిమాలకు సమస్యలు ఎదురవుతాయన్నాడు.అసలు టికెట్ల ధరల గురించి తెలియకుండా నాని మాట్లాడటం కరెక్ట్ కాదని.. నాని వెంటనే ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని మీడియా సమావేశంలో నిర్మాత నట్టి కుమార్ చెప్పుకొచ్చాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story