Allu Arjun: 'సరికొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం'.. బన్నీ, త్రివిక్రమ్‌ మూవీపై ప్రొడ్యూసర్‌

Allu Arjun and Trivikram movie: అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Oct 2024 3:54 PM IST
Allu Arjun and Trivikram movie
X

Allu Arjun and Trivikram movie

Allu Arjun: అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటి వరకు వచ్చిన మూడు చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. జులాయి, సనాఫ్‌ సత్యమూర్తి, అలవైకుంఠపురం.. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసుకున్నాయి. కాగా ఇప్పుడీ వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగో సినిమా రానున్న విషయం తెలిసిందే.

అల్లుఅర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న 4వ సినిమాకు సంబంధిచి తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో జోష్‌ను నింపాయి. ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు చివరి దశలో ఉన్నాయన్న నాగవంశీ.. ‘పుష్ప 2’ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. జనవరిలో స్పెషల్‌ ప్రోమోతో సినిమాను ప్రకటిస్తామన్నారు. మార్చిలో అల్లఅర్జున్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని నాగ వంశీ తెలిపారు.

ఇప్పటి వరకు ఎన్నో అద్భుత చిత్రాలు తెరకెక్కించిన రాజమౌళి సైతం టచ్‌ చేయని కథాంశంతో ఈ సినిమా రానుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం ఇప్పటివరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నాగ వంశీ చెప్పుకొచ్చారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి.

కాగా దేవర సినిమా సమయంలో టికెట్ల ధరల వ్యాఖ్యలపై నాగవంశీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాగవంశీ మరోసారి స్పందించారు. ఒక ఏడాదిలో మూడు, నాలుగు పెద్ద సినిమాలకే టికెట్ల ధరలు పెంచుతున్నట్లు చెప్పారు. మిగతా వాటికి రేట్లు పెంచడంలేదని స్పష్టంచేశారు. పెద్ద సినిమాలకు బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది కాబట్టి వారం రోజులు టికెట్ల రేట్లు పెంచుతామన్నారు. జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం వారి ఉద్దేశం కాదని తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story