Akhanda-2 : అఖండ కి సీక్వెల్ ఉంటుంది అంటున్న నిర్మాత

Akhanda-2 : "అఖండ 2" పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

admin1
Published on: 31 Dec 2021 1:36 PM IST
Producer Miryala Ravinder Reddy gave Clarity on Akhanda 2 Movie
X

"అఖండ 2" పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Akhanda-2: "సింహా", "లెజెండ్" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "అఖండ" సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా మారి వీరిద్దరి కాంబినేషన్ కి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. విడుదలై ఎన్ని వారాలు గడుస్తున్నా ఇంకా కొన్ని థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డు తగిలించెలా చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. ఈ సినిమా విడుదలై 25 రోజులు పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ రవీందర్ రెడ్డి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు.

విడుదలయ్యే ముందు బ్రేక్ ఈవెన్ పాయింట్ 22.5 crores ఉందని కానీ విడుదల తర్వాత మూవీ బిజినెస్ చాలా బాగా జరిగిందని దానికి చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు రవీందర్ రెడ్డి. అంతే కాకుండా మళ్లీ అదే కాంబినేషన్లో "అఖండ 2" సినిమా చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం గమనార్హం. అయితే ఇప్పటికే వరుసగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బాలకృష్ణ మరియు బోయ పాటి "అఖండ 2" సినిమా కోసం ఇప్పట్లో చేతులు కలుపుతారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story