చిరంజీవి సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న నిర్మాత...

చిరంజీవి సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న నిర్మాత...
x

చిరంజీవి సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న నిర్మాత...

Highlights

KS.RamaRao: ఒకప్పుడు స్టార్ నిర్మాత గా ఉండేవారు కానీ స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కె.ఎస్.రామారావు కరీర్ మారిపోయింది.

KS.RamaRao:. ఒకప్పుడు స్టార్ నిర్మాత గా ఉండేవారు కానీ స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కె.ఎస్.రామారావు కరీర్ మారిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేఎస్ రామారావు ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. వరుస హిట్లు వస్తున్న సమయంలో బోలెడు అంచనాల మధ్య "స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్" సినిమా విడుదలైంది అని అన్నారు.

"ఫ్లాప్ అంటే ఏమిటో దాని బాధ ఎలా ఉంటుందో అప్పటి వరకు నాకు తెలీదు. మెగాస్టార్ తో జర్నీ చేశాను కాబట్టి స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమా విషయంలో కూడా అదే గుడ్డి నమ్మకంతో ముందుకు వెళ్ళిపోయాను. కానీ ఆ సమయంలో సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణం బాగా తీయకపోవడమో, చేయకపోవడమో కాదు. వీరేంద్రనాథ్ గారి నవల ఆధారంగా కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆయన కమర్షియల్ డైరెక్టర్ గా ఎదగలేదు. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది. నా సినిమా ఫ్లాప్ అన్న ఈగో నన్ను కలిచివేసింది. అప్పుడే ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో "చంటి" చేశాను. దాని ఫలితం అందరికీ తెలుసు" అని చెప్పుకొచ్చారు కేఎస్ రామారావు.

Show Full Article
Print Article
Next Story
More Stories