Gentleman Sequel : ఆఫీషియల్ : శంకర్ 'జెంటిల్‌మేన్‌' కి సీక్వెల్!

Gentleman Sequel : ఆఫీషియల్ : శంకర్ జెంటిల్‌మేన్‌ కి సీక్వెల్!
x

shankar, Gentleman movie 

Highlights

Gentleman Sequel : తమిళ్ టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో యాక్షన్‌ హీరో అర్జున్‌ హీరోగా వచ్చిన ‘జెంటిల్‌మేన్‌’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని

Gentleman Sequel : తమిళ్ టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో యాక్షన్‌ హీరో అర్జున్‌ హీరోగా వచ్చిన 'జెంటిల్‌మేన్‌' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 1993లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ని షేక్ చేసింది. ఇది శంకర్ కి ఫస్ట్ సినిమా కావడం విశేషం.. ఇందులో అర్జున్ సరసన మధుబాల, శుభశ్రీ నటించారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళకి నిర్మాత కేటీ కుంజుమన్‌ గుడ్ న్యూస్ చెప్పారు.

'జెంటిల్‌మేన్‌' సినిమాకి సీక్వెల్‌ను రూపొందించనున్నట్లుగా ఆఫీషియల్ అనౌన్సు మెంట్ ఇచ్చారు. ' 27 సంవత్సరాల కిందట మేము తీసిన 'జెంటిల్‌మేన్‌' సినిమాకి సీక్వెల్‌గా త్వరలో 'జెంటిల్‌మేన్‌-2' నిర్మించబోతున్నాం.. ఈ ఈవిషయాన్ని మీ అందరితో పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది' అని ఆయన ట్వీట్‌ చేశారు. దీనితో ఇప్పుడే సినిమా పైన అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తారు అన్న దానిపైన ఆసక్తి నెలకొంది. దీనికి మళ్ళీ శంకర్ దర్శకత్వం వహిస్తారా లేదా అన్నదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం శంకర్ కమల్ హసన్ తో భారతీయుడు సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెట్ లో పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. లైకా సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. భారతీయుడు సినిమాకి సీక్వెల్ వస్తుండడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories