KP Chowdary: కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసు.. కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు

KP Chowdary: రెండు రోజుల విచారణలో కొన్ని పేర్లు తెలిపిన కేపీ చౌదరి

Jyothi
Published on: 24 Jun 2023 7:44 AM IST
Producer KP Chowdary Drugs Case Latest Updates
X

KP Chowdary: కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసు.. కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు

KP Chowdary: నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తనకు డ్రగ్స్‌ అలవాటు ఉందని అంగీకరించిన నిర్మాత... కొందరు ఆర్టిస్టులకు డ్రగ్స్‌ అమ్మినట్లు పోలీసులకు వెల్లడించాడు. రెండు రోజుల పాటు కేపీ చౌదరిని విచారించిన పోలీసులు అతడి ఫోన్‌లో కీలక ఆధారాలను సేకరించారు. కేపీ కాల్‌ లిస్ట్‌ను డీకోడ్‌ చేయగా అతడు అషూరెడ్డితో పాటు టాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌ చేసిన ఓ హీరోయిన్‌తో వందల సంఖ్యలో కాల్స్‌ మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా అతడి ఫోన్‌లో వారితో క్లోజ్‌గా దిగిన ఫోటోలు కూడా లభ్యమయ్యాయి.

కేపీ లిస్ట్‌లో 12 మంది బడాబాబులు, పలువురు సెలబ్రిటీలు, యువతులు ఉన్నట్లు తెలిసింది. అలాగే కేపీ చౌదరి.. రఘుతేజ, సనా మిశ్రా, సుశాంత్‌ రెడ్డి, నితినేశ్‌, బెజవాడ భరత్‌, శ్వేత, టాగోర్‌ ప్రసాద్‌లకు ‍డ్రగ్స్‌ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. అతడి ఖాతాలో 11 అనుమానాస్పద లావాదేవీలను సైతం గుర్తించారు.

జూన్‌ 14న డ్రగ్స్‌ కేసులో నిర్మాత కేపీ చౌదరిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో భాగంగా డ్రగ్స్‌ కింగ్‌ పిన్‌ నైజీరియన్‌ గాబ్రియల్‌, డ్రగ్స్‌ పెడ్లర్‌ రాకేశ్‌ రోషన్‌లతో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. మొదట ఎవరికీ డ్రగ్స్‌ అమ్మలేదని బుకాయించిన నిర్మాత.... రెండురోజుల విచారణలో 12 మందికి డ్రగ్స్‌ అమ్మినట్లు ఒప్పుకున్నాడు.

Jyothi

Jyothi

Next Story