ఆరెంజ్ సినిమాకి సీక్వెల్ రిస్క్ అవుతుందా?

Ram Charan: ఆరెంజ్ సినిమాకి సీక్వెల్ రిస్క్ అవుతుందా?

Dhatripriya
Updated on: 31 March 2023 9:30 PM IST
Producer Is Planning Sequel To Orange Movie
X

ఆరెంజ్ సినిమాకి సీక్వెల్ రిస్క్ అవుతుందా?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా "మగధీర" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నటించిన చిత్రం "ఆరెంజ్". రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ ను అందుకుంది. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఒక సరికొత్త లవ్ స్టోరీ ని ఈ సినిమాతో ఆవిష్కరించాలని అనుకున్నారు కానీ ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. సినిమాని నిర్మించిన నాగబాబు తీవ్ర నష్టాలకు గురయ్యారు.

సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులకి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్ "ఆరెంజ్" సినిమాని ఒక కల్ట్ క్లాసిక్ గా చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మార్చ్ 27న మార్చ్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. మూడు రోజులపాటు థియేటర్ లలో ఆడిన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లు అందుకొని రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అవడంతో సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుంటుందని చర్చలు మొదలయ్యాయట.

అప్పట్లో రామ్ చరణ్ కాకుండా వేరే హీరో ఎవరైనా చేసి ఉంటే సినిమా హిట్ అయ్యేది అని కొందరు అన్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ ఒక ప్రేమ కథ చిత్రం చేయటం రిస్క్ అని చెప్పుకోవాలి. మాస్ హీరో ఇమేజ్ కూడా వచ్చేసిన తర్వాత లవ్ స్టోరీలు చేస్తే ప్రేక్షకులు అంతగా ఆదరించే అవకాశాలు లేవు. మరి ఒకవేళ "ఆరెంజ్" సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తే అది రామ్ చరణ్ తోనే ప్లాన్ చేస్తారా లేక మరే హీరోతో అయినా తెరకెక్కిస్తారా అని ఇంకా తెలియాల్సి ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story