టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి..

Producer Gorantla Rajendra Prasad Passed Away
x

టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి..

Highlights

Tollywood News: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.

Tollywood News: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. నిన్న ఫిలిం ఎడిటర్‌ గౌతమ్‌ రాజు హఠాన్మరణం మరువకముందే నిర్మాత రాజేంద్ర ప్రసాద్‌ మృతితో టాలీవుడ్‌ సినీ పరిశ్రమ మరోసారి విషాదంలోకి వెళ్లింది. తాజాగా ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ (86) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేంద్రప్రసాద్‌ మరణంతో టాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్రప్రసాద్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. 'మాధవి పిక్చర్స్‌' సంస్థను స్థాపించి అపురూప చిత్రాలకు నిర్మాతగా వ్యహరించారు. 'దొరబాబు', 'సుపుత్రుడు', 'కురుక్షేత్రం', 'ఆటగాడు' వంటి చిత్రాలు ఆ బ్యానర్‌ నుంచి వచ్చినవే.

Show Full Article
Print Article
Next Story
More Stories