Tollywood: తమిళంలో రీమేక్ కాబోతున్న కమెడియన్ సినిమా

Tollywood: వేరే భాషలో రీమేక్ కాబోతున్న "వివాహ భోజనంబు"

admin1
Updated on: 18 Oct 2021 10:15 PM IST
Producer Gnanavel Raja Plans to Remake Vivaha Bhojanambu Movie in Tamil
X

తమిళం లో రీమేక్ కాబోతున్న వివాహ భోజనంబు (ఫైల్ ఇమేజ్)

Tollywood: ఈ మధ్యనే కమెడియన్ సత్య హీరోగా "వివాహ భోజనంబు" అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్ క్యామియో పాత్ర పోషించిన సినిమా డైరెక్ట్ గా సోనీ లీవ్ లో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఒక పిసినారి కుర్రాడి పెళ్లి కరోనా సమయంలో జరుగుతుంది. కానీ అదే సమయంలో లాక్డౌన్ రావడంతో పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ పెళ్ళికొడుకు ఇంట్లోనే ఉండి పోతారు. అప్పుడే పెళ్లయిన ఆ పిసినారి కుర్రాడి పరిస్థితి ఏమైంది? అనేది ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించారు.

సినిమా మొదటి నుంచి ఆఖరి దాకా ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేసారు దర్శకుడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాని తమిళంలోకి రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ కోలీవుడ్ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. తమిళంలో సంతానం, యోగిబాబు వంటి స్టార్ కమిడియన్ లకి ఈ కథ బాగా సెట్ అవుతుంది. అయితే తమిళ ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథలో కొన్ని మార్పులు చేయవచ్చు. ఏదేమైనా తక్కువ బడ్జెట్తో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు రీమేక్ హక్కుల ద్వారా కూడా నిర్మాతలకు అదనపు ఆదాయం లభించింది.

admin1

admin1

Next Story