Sudhakar Cherukuri: నాని టీం సభ్యులకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

* ఈ నేపథ్యంలో టీం సభ్యుల హార్డ్ వర్క్ ని గుర్తించిన సుధాకర్ చెరుకూరి చిత్ర బృందానికి సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చారట.

R Tripura Malini
Published on: 24 Nov 2022 9:28 AM IST
Producer Gifts Iphone To Nani Team Members
X

నాని టీం సభ్యులకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

Sudhakar Cherukuri: తాజా సమాచారం ప్రకారం ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన టీం సభ్యులకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న "దసరా" సినిమాని సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా విజువల్స్ ని చూసిన సుధాకర్ చెరుకూరి చాలా బాగా సాటిస్ఫై అయ్యారట. ఈ నేపథ్యంలో టీం సభ్యుల హార్డ్ వర్క్ ని కూడా గుర్తించిన సుధాకర్ చెరుకూరి చిత్ర బృందానికి సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చారట. చాలా వరకు సినిమా షూటింగ్ దుమ్ము మరియు మురికిలో జరిగిందట.

ఈ నేపథ్యంలో సినిమా కోసం కష్టపడి పని చేసిన వారి కోసం సుధాకర్ చెరుకూరి 28 బ్రాండ్ న్యూ ఐఫోన్ 14 ఫోన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. చూస్తూ ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని సుధాకర్ చెరుకూరి నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సినిమా విడుదలవకముందే సుధాకర్ చెరుకూరి వల్ల సినిమా కోసం కష్టపడ్డ కొంతమందికి మంచి గిఫ్ట్లు అయితే లభించాయి. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. సముతిరఖని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ను వెచ్చిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 23న థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story