దానయ్య నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది?

*ప్రభాస్ మరియు చిరంజీవి లలో ఒకరిని ఎంపిక చేయనున్న దానయ్య

Rama Rao
Published on: 25 May 2022 1:32 PM IST
Producer DVV Danayya is The Next Movie Hero | Telugu Movie News
X

దానయ్య నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది?

DVV Danayya: కరోనా కి ముందు వరకు ఏడాదికి ఒకటి అరా సినిమాలు చేసే స్టార్ హీరోలు ఇప్పుడు మాత్రం తమ స్పీడ్ పెంచారు. ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతున్న అప్పుడే మరొక రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా వరుసగా సినిమా షూటింగులతో బిజీ అయిపోవాలని ప్లాన్ చేస్తున్నారు స్టార్ హీరోలు. ఈ నేపథ్యంలో బోలెడు బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న చిరంజీవి చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. మోహన్ రాజా డైరెక్షన్ లో "లూసిఫర్" రీమేక్ అయిన "గాడ్ ఫాదర్" సినిమాలో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమానీ "భోళా శంకర్" అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య సినిమాతో కూడా చిరంజీవి బిజీగా ఉన్నారు.

ఇటు ప్రభాస్ కూడా "రాధేశ్యామ్" సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో "సలార్", ఓం రౌత్ డైరెక్టర్ దర్శకత్వంలో "ఆది పురుష్", నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కె", సందీప్ వంగా దర్శకత్వంలో "స్పిరిట్" సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక చిరు వెంకీ కుడుములు కాంబో లో రాబోతున్న సినిమా, మారుతి తో ప్రభాస్ "రాజా డీలక్స్" సినిమాలను డీ వీ వీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోల లో దానయ్య ఎవరి సినిమా ముందు పట్టాలెక్కిస్తారు అని ఇంకా తెలియాల్సి ఉంది.

Rama Rao

Rama Rao

Next Story