ఐదు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న "ఆర్ఆర్ఆర్" నిర్మాత

DVV Danayya: ఐదు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న "ఆర్ఆర్ఆర్" నిర్మాత

admin1
Updated on: 6 March 2022 10:30 AM IST
Producer DVV Danayya Busy With Five Big Budget Movies | Telugu Movie News
X

ఐదు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న "ఆర్ఆర్ఆర్" నిర్మాత

DVV Danayya: ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈమధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డి.వి.వి.దానయ్య ఈ సినిమా ఈనెల 25 వ తారీకున థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక వచ్చే రెండేళ్లు కూడా వరుస సినిమాలతో దానయ్య బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను దానయ్య స్వయంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "తేరి" ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాహో డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరో వైపు రామ్ చరణ్ హీరోగా కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ ఒక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ప్రభాస్ మరియు మారుతి కాంబో లో రాబోతున్న సినిమా ను కూడా దానయ్య నిర్మిస్తున్నారు. మరోవైపు యువ హీరో నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న ఒక సినిమాను నిర్మిస్తున్న దానయ్య మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వంటి స్టార్ హీరోలకు కూడా అడ్వాన్సు ఇచ్చినట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story