Vakeel Saab: దిల్‌రాజుకు కరోనా పాజిటివ్‌.. టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ..

Vakeel Saab: వకీల్ సాబ్ చిత్ర యూనిట్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు పాజిటివ్ నిర్ధారణ అయింది.

Arun Chilukuri
Published on: 13 April 2021 1:25 PM IST
Producer Dil Raju Tests positive for Coronavirus
X

Vakeel Saab: దిల్‌రాజుకు కరోనా పాజిటివ్‌.. టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ..

Vakeel Saab: వకీల్ సాబ్ చిత్ర యూనిట్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు పాజిటివ్ నిర్ధారణ అయింది. వకీల్ సాబ్ ప్రచార కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంటుంది. హీరో పవన్ కల్యాణ్ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో పవన్ కల్యాణ్ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు దిల్ రాజుకు కరోనా సోకినట్లు తేలింది.

ఇప్పటికే తిరుపతి ఎన్నికల సభను పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ప్రచార కార్యక్రమాల్లో తమతో కలిసి పాల్గొన్నవారు టెస్ట్ లు చేయించుకోవాలని దిల్ రాజు కోరారు. రీసెంట్‌గా దిల్‌రాజు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. దీంతో మెగా ఫ్యామిలీలోనూ కరోనా భయం పట్టుకుంది. 'వకీల్‌సాబ్‌' దర్శకుడు వేణు శ్రీరామ్‌ కూడా చాలా రోజులుగా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్‌రాజుతో కలిసి తిరుగుతున్నారు. ఆయన కూడా టెస్ట్‌ చేయించుకున్నారని సమాచారం. ఈ క్రమంలో ఈ మధ్య తనను కలిసిన వారందరూ వెళ్లి కరోనా టెస్టులు చేయించుకోవాలని దిల్‌రాజు కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story