Vakeel Saab: ఆ సాంగ్ పెడితే ‎సినిమా మరోలా ఉండేది- దిల్ రాజు

‘వకీల్‌సాబ్’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌పై వస్తున్న వార్తలపైనా దిల్‌రాజు స్పష్టత ఇచ్చారు.

Samba Siva Rao
Published on: 17 April 2021 8:05 PM IST
Dil Raju about Vakeel saab
X

దిల్ రాజు ఫైల్ ఫోటో

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం వకీల్ సాబ్. గత వారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫిసు దగ్గర భారీ విజయం నమోదు చేసింది. ఈ విజయం సాధించిన సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాలో మాట్లాడుతూ.. వకీల్ సాబ్ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులు, అభిమానులకు దిల్‌రాజు కృతజ్ఞతలు తెలిపారు.

వకీల్‌సాబ్‌ లాంటి సందేశాత్మక చిత్రాల్లో మాస్‌ సాంగ్స్‌ పెడితే మిస్‌ ఫైర్‌ అవుతుందని దిల్ రాజు అన్నారు. పవన్‌కల్యాణ్‌తో మరో సినిమా తీయడానికీ తాము సిద్ధంగా ఉన్నామని, దర్శకుడు వేణుకు మంచి ఆలోచన వస్తే, నేరుగా పవన్‌కే కథ చెబుతామన్నారు. 'వకీల్‌సాబ్' సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌పై వస్తున్న వార్తలపైనా దిల్‌రాజు స్పష్టత ఇచ్చారు. సత్యదేవ్‌(పవన్) గతం ఏంటో చెప్పాలనే ఉద్దేశంతోనే దర్శకుడు ఫ్లాష్‌ బ్యాక్‌ రాసుకున్నాడనీ, అది కూడా 20 నిమిషాల్లోనే ముగించాడని దిల్‌రాజు చెప్పారు. 'వకీల్‌సాబ్'లో ఐటమ్ సాంగ్‌ పెట్టి ఉంటే సినిమా బతికేది కాదని దిల్‌ రాజు అన్నారు.

అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పింక్ సినిమాకు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రల్లో నటించారు. ప్రకాశ్ రాజ్ సినిమాలో లాయర్ నందగా చేశాడు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story