Bheemla Nayak Movie: భీమ్లానాయక్‌ సినిమా విడుదల వాయిదా

పవన్‌, నిర్మాతలు సినిమా వాయిదా ఒప్పుకున్నారు -దిల్‌రాజు ఫిబ్రవరి 25న భీమ్లానాయక్‌ విడుదల -దిల్‌రాజు

Sandeep Reddy
Updated on: 21 Dec 2021 2:03 PM IST
Producer Dil Raju Annouced Bheemla Nayak Movie Postponed to 25th February 2021
X

భీమ్లానాయక్‌ సినిమా విడుదల వాయిదా

Bheemla Nayak Movie: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు నిర్మాత దిల్‌రాజు. భీమ్లా నాయక్‌ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. జనవరి 12న భీమ్లా నాయక్‌ రిలీజ్‌ కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు దిల్‌రాజు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25 శివరాత్రి రోజున భీమ్లా నాయక్‌ విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

సినిమా విడుదల వాయిదాపై పవన్‌, నిర్మాతలు సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. కరోనా వల్ల సినిమాల విడుదల్లో ఇబ్బందులు తల్లెత్తుతున్నాయన్న దిల్‌రాజు.. అభిమానులు అర్థం చేసుకోవాలని కోరారు. ఇక జనవరి 7న ట్రిపుల్ ఆర్‌, జనవరి 14న రాధేశ్యామ్‌ విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story