Dil Raju Adopting Three Orphan Children's : ముగ్గరు అనాథ‌ల‌ను ద‌త్తత తీసుకున్న దిల్ రాజు

Dil Raju Adopting Three Orphan Children's :టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు గొప్ప మనసును చాటుకున్నారు.

Krishna
Published on: 2 Aug 2020 12:30 PM IST
Dil Raju Adopting Three Orphan Childrens : ముగ్గరు అనాథ‌ల‌ను ద‌త్తత తీసుకున్న దిల్ రాజు
X
Dil Raju Adopting Three Orphan Children's

Dil Raju Adopting Three Orphan Children's :టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు గొప్ప మనసును చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారినముగ్గురు పిల్లల‌ను ద‌త్తత తీసుకుంటున్నట్లుగా అయన వెల్లడించారు. యాదాద్రి భున‌వ‌గిరి జిల్లా ఆత్మకూరు మండ‌ల‌ కేంద్రంలోని స‌త్యనారాయ‌ణ, అనురాధ‌కు ముగ్గురు సంతానం ఉన్నారు. ఏడాది క్రితం స‌త్యనారాయ‌ణ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటినుంచి అనురాధే ఆ ముగ్గురి పిల్లలను కూలీపనికి వెళ్తూ చూసుకుంటుంది. అయితే వారం రోజుల క్రితం త‌ల్లి అనురాధ కూడా అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో స‌త్యనారాయ‌ణ, అనురాధ దంపతుల పెద్ద కుమారుడు మ‌నోహ‌ర్ త‌న చెల్లి, త‌మ్ముడి ఆల‌నా పాల‌నా చూసుకుంటున్నాడు.

అయితే ఈ విషయాన్నీ రాజేశం క‌ర‌ణం అనే ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సోనూసూద్ దృష్టికి తీసుకువెళ్ళాడు. అయితే దీనిపైన స్పందించిన సోనూసూద్ ముగ్గురు పిల్లలు అనాథ‌లు కాద‌ని, ఇక‌పై తాను వారికి అండ‌గా ఉంటాన‌ని, ఇకపై వారి భాద్యత నాదే అంటూ హామీ ఇచ్చాడు. వారిని మ‌హారాష్ట్రలోని నాసిక్‌కు తీసుకువ‌చ్చి ఓ ఆశ్రమంలో ఉంచుతాన‌ని తెలిపాడు. తాజాగా ఈ కథనం పైన నిర్మాత దిల్ రాజు చలించిపోయి ఆ ముగ్గురిని ద‌త్తత తీసుకునేందుకు ముందుకు వ‌చ్చారు. వారి బాధ్యతను తానే చూసుకుంటానని వెల్లడించారు. అయితే ఆ ముగ్గురు పిల్లలు ఈ ఇద్దరిలో ఎవరి ద‌గ్గర‌కు వెళ్తార‌నేది ఇంకా నిర్ణయించుకోలేదు. గొప్ప మానవత్వంతో ముందుకు వచ్చిన దిల్ రాజును పలువురు అభినందిస్తున్నారు.

Krishna

Krishna

Next Story