Balakrishna - Raghavendra Rao: దర్శకేంద్రుడితో చేతులు కలపనున్న బాలకృష్ణ

*బాలకృష్ణ సినిమాకి దర్శకేంద్రుడిని రంగంలోకి దింపిన సీ కళ్యాణ్

admin1
Updated on: 22 Dec 2021 4:45 PM IST
Producer C Kalyan Planning to do a Movie with Balakrishna and Raghavendra Rao
X

దర్శకేంద్రుడితో చేతులు కలపనున్న బాలకృష్ణ

Balakrishna - Raghavendra Rao: ఈ మధ్యనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు సీ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మధ్యనే బాలకృష్ణని కలిసిన సీ కళ్యాణ్ ఒక సినిమా చేయాలని అని అడిగారట దానికి బాలయ్య కూడా వెంటనే ఓకే అన్నారట. అప్పటి నుంచి బాలకృష్ణ కోసం ఒక మంచి కథ వెతుకుతున్నారు. ఇక "రామానుజాచార్య" కథ రావడంతో సి.కల్యాణ్ ఇలాంటి సినిమాలు చేయడానికి బాలయ్య కి కూడా ఆసక్తి చూపిస్తారు కాబట్టి వెంటనే దాన్ని పట్టాలెక్కించేయాలని అనుకున్నారు.

బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కథపై కసరత్తులు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కథతో డైరెక్టర్ ప్రస్తుతం రాఘవేంద్ర రావుతో ఈ కథకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంతకు ముందు రాఘవేంద్రరావు బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన "పాండురంగడు" సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈసారి వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

admin1

admin1

Next Story