Tollywood: చిల్లర ట్రిక్స్‌ ప్లే చేయొద్దు - బన్నీ వాసు ఫైర్‌

Tollywood: టాలీవుడ్‌లో లుకలుకలు బయటపడ్డాయి. మెగా ప్రొడ్యూసర్ బన్నీవాస్ ఉన్నట్టుండి ఎవరిపైనో చిర్రుబుర్రులాడారు.

Arun Chilukuri
Updated on: 17 March 2021 5:51 PM IST
Producer Bunny Vasu Serious Warning to PROs Over Chaavu Kaburu Challaga OTT
X

చిల్లర ట్రిక్స్‌ ప్లే చేయొద్దు : బన్నీ వాసు ఫైర్‌

Tollywood: టాలీవుడ్‌లో లుకలుకలు బయటపడ్డాయి. మెగా ప్రొడ్యూసర్ బన్నీవాస్ ఉన్నట్టుండి ఎవరిపైనో చిర్రుబుర్రులాడారు. పేరు చెప్పలేదు కానీ ఎవరినో గట్టిగానే వేసుకున్నాడు. ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు, పీఆర్వోలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతకీ బన్నీవాస్‌ ఎందుకా ఆ కామెంట్స్ చేశారు. ఎవరిని ఉద్దేశించి చేశారు.

కార్తీకేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన 'చావు కబురు చల్లగా' మూవీని బన్నీవాసు ప్రొడ్యూస్‌ చేశాడు. ఈ మూవీ మార్చి 19న థియేటర్స్‌లోకి రానుంది. అయితే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ తెగ ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై బన్నీవాసు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని గట్టిగా హెచ్చరించారు. తాను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్లకి అర్థం అవుతుందన్నారు. మీరు ఎన్ని సినిమాలు చేశారో.. కొత్తగా వచ్చారో అన్నది పక్కన పెట్టి హెల్దీగా పోటీ పడదామన్నారు.

ఇదిలా ఉంటే ఇంతకీ బన్నీవాసు ఎవరిపై ఫైర్ అయ్యారు ఎవరికి వార్నింగ్ ఇచ్చారు అనే విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. బన్నీ వాస్‌ కామెంట్స్ వింటే ఇటీవల మూవీని రిలీజ్ చేసిన కొత్త ప్రొడ్యూసర్లను టార్గెట్‌ చేసినట్లు అర్థమవుతోంది. ఈ మధ్య గాలి సంపత్, శ్రీకారం, జాతి రత్నాలు మూవీలు రిలీజ్ అయ్యాయి. ఇందులో జాతి రత్నాలు ప్రొడ్యూసర్స్ కొత్తవాళ్లుగా ఉన్నారు. అంటే అందరు ఖచ్చితంగా జాతిరత్నాలు మూవీ ప్రొడ్యూసర్లకే బన్నీవాస్ వార్నింగ్‌ ఇచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story