Bunny Vas: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు బన్నీ వాసు లేఖ

Producer Bunny vas Letter to Google CEO Sundar Pichai
x

గూగుల్ సీఈఓ కు లేఖ రాసిన బన్నీ వాసు (ఫైల్ ఇమేజ్)

Highlights

Bunny Vas: నా కుమార్తెను చంపేస్తాన‌ని ఓ వ్యక్తి వీడియో పెట్టాడు : బ‌న్నీ వాసు * ఆ వీడియో తొలగించేలా చేయ‌డానికి చాలా క‌ష్టాలు ప‌డ్డాను

Bunny Vas: గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌కు ప్రముఖ నిర్మాత బ‌న్నీ వాసు లేఖ రాశారు. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న త‌ప్పుడు ప్రచారంపై లేఖ‌లో ఆవేద‌న వ్యక్తం చేశారు. త‌న కుమార్తెను చంపేస్తాన‌ని చెబుతూ ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టాడని చెప్పుకొచ్చారు. ఆ వీడియోను తొల‌గించేలా చేయ‌డానికి ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాన‌ని చెప్పారు.

ఇప్పటికే చాలా సార్లు ఆయా సామాజిక మాధ్యమాల సంస్థల‌కు ఫిర్యాదులు చేశాన‌ని లేఖలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవ‌రో ఒక‌రు పెట్టిన స‌మాచారం అబ‌ద్ధమ‌ని నిరూపించ‌డం చాలా క‌ష్టమ‌ని లేఖలో తెలియజేశారు బన్నీ వాసు. ఇటువంటివి ఆన్‌లైన్‌లో రాకుండా చూసుకునేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories