Sai Pallavi: సాయిపల్లవి సినిమా నిర్మాత కన్నుమూత

Sai Pallavi: అన్నంరెడ్డి కృష్ణకుమార్ నిర్మాతగా సాయిపల్లవి నటించిన అనుకోని అతిథి సినిమా మరో రెండు రోజుల్లో ‘ఆహా’లో విడుదల కానుంది.

Sandeep Eggoju
Published on: 26 May 2021 11:01 AM IST
Producer Annam Reddy Krishna Kumar Passes Away
X
సాయి పల్లవి & ప్రొడ్యూసర్ కృష్ణ (ఫైల్ ఇమేజ్)

Sai Pallavi: టాలీవుడ్‌లో ఇటీవల వరుస విషాదాలు సంభవిస్తున్నాయి. ఒక వైపు కరోనాతో టాలీవుడ్ ప్రముఖులను పగబట్టినట్లే కబళిస్తోంది. మరోవైపు అనారోగ్యంతో మరికొంత మంది సినీపరిశ్రమకు దూరం అవుతున్నారు. ప్రముఖ గాయకుడు జి.ఆనంద్, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్‌జీ, రచయిత, దర్శకుడు నంద్యాల రవి, నటుడు టీఎన్ఆర్, పీఆర్వో బీఏ రాజు కన్నుమూసిన విషయం తెలిసిందే.

తాజా చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ ఈ తెల్లవారుజామున విశాఖపట్టణంలో గుండెపోటుతో కన్నుమూశారు. అన్నంరెడ్డి తాజాగా నిర్మించిన 'అనుకోని అతిథి' సినిమా మరో రెండు రోజుల్లో 'ఆహా'లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి, ఫహాద్ ఫాజిల్ నటించారు. అన్నంరెడ్డి మృతికి చిత్రబృందమే కాకుండా, టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story