Allu Arjun - Ramcharan: మెగా హీరోలతో సినిమా చేయబోతున్న రాజమౌళి..!?

* రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ తో చేతులు కలుపనున్న స్టార్ డైరెక్టర్

admin1
Updated on: 31 Aug 2021 5:09 PM IST
Producer Allu Aravind Planning to Produce the Movie Starring Allu Arjun And Ram Charan in Rajamouli Direction
X

రాజమౌళి తో అల్లు అర్జున్ (ఫైల్ ఫోటో)

Rajamouli - Allu Arjun: టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకుడు జక్కన్న రాజమౌళి మెగా హీరోలలో కేవలం రామ్ చరణ్ తో మాత్రమే సినిమా చేశారు. "మగధీర" తో రామ్ చరణ్ కి కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే మెగా నిర్మాత అల్లు అరవింద్ "మగధీర" సినిమా విడుదల తర్వాత నుంచి రాజమౌళితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అది మాత్రం పట్టాలెక్కలేదు. తాజాగా "ఆర్ఆర్ఆర్" సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమా తరువాత సినిమాకి అల్లు అరవింద్ రాజమౌళిని లాక్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇప్పటికే గీతా ఆర్ట్స్ సంస్థ రాజమౌళికి పెద్ద అడ్వాన్స్ ని ఆఫర్ చేసినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి సినిమా చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని రాజమౌళితో కూడా చెప్పారు. కానీ "ఈగ" దర్శకుడు మాత్రం ఇంకా తన తుది నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంది. అల్లుఅర్జున్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి సినిమా తీస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఒకవేళ ఈ సినిమా లాంచ్ అయితే మెగా అభిమానులకు ఇది కన్నుల విందు అవుతుందని చెప్పుకోవచ్చు.

admin1

admin1

Next Story