BA Raju: ప్రముఖ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూత

BA Raju: ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు గుండె పోటుతో కన్నుమూశారు.

Kranthi
Updated on: 22 May 2021 7:01 AM IST
PRO BA Raju Passes Away
X

PRO BA Raju 

BA Raju: బీఏరాజు.. ఈ పేరు చూడగానే తెలిసిన పేరే అని సామాన్య సినీ ప్రేక్షకుడు కూడా అనుకుంటాడు. ప్రతి సినిమా టైటిల్స్ లో పీఆర్ఓ బీఏ రాజు అని కోట్లాది ప్రేక్షకులు ఎన్నోసార్లు చూసుంటారు. టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికీ ఆప్తుడైన బీఏరాజు ఇక లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస విషాదాలతో టాలీవుడ్ వేదనతో కుమిలిపోతోంది.

ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఆయన కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. కొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

సినిమా జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించిన బీఏ రాజు.. చాలా మంది అగ్ర నటులకు పీఆర్‌ఓగా వ్యవహరించారు. దీంతోపాటు ఆయన పలు సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు. సూపర్ హిట్ మ్యాగజైన్‌కు సంపాదకుడిగా, నిర్వాహకుడిగా వ్యవహరించారు. కాగా.. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే.. రెండేళ్ల క్రితయం బీఏ రాజు భార్య.. దర్శకురాలు జయ కూడా కన్నుమూశారు.

Kranthi

Kranthi

Next Story