Bigg Boss 7 Elimination: ఐదోవారం ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ బైబై చెప్పేది ఎవరికంటే?

Bigg Boss 7 Elimination: ఉల్టా-పుల్టా అంటూ ఊదరగొట్టిన బిగ్ బాస్ మేనేజ్మెంట్ తీరు చూసి, ఈసారి ఏదో ప్రత్యకంగా ప్లాన్ చేశారని అనుకుంటారు.

Arun Chilukuri
Published on: 7 Oct 2023 12:13 PM IST
Priyanka Jain Elimination in 5th Week From Bigg Boss 7 Telugu Season
X

Bigg Boss 7 Elimination: ఐదోవారం ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ బైబై చెప్పేది ఎవరికంటే?

Bigg Boss 7 Elimination: ఉల్టా-పుల్టా అంటూ ఊదరగొట్టిన బిగ్ బాస్ మేనేజ్మెంట్ తీరు చూసి, ఈసారి ఏదో ప్రత్యకంగా ప్లాన్ చేశారని అనుకుంటారు. కానీ, తీరా హౌస్‌లో సీన్స్ చూస్తుంటే మాత్రం కాస్తా తేడాగానే కనిపిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం, ఇప్పటి వరకు ఎలిమినేషన్ అయిన వారిలో అంతా లేడీస్ ఉండడమే. అవును, గత నాలుగు వారాలుగా ఇంటి నుంచి వెళ్లిన వారంతా మహిళలే కావడంతో, అసలు బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నారో జనాలకు తెలియకుండా పోయింది. ఇదంతా పక్కన పెడితే, ఐదో వారం ఎలిమినేషన్స్‌పైనా కాస్త ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, ఈ వారం జెంట్స్ నుంచి ఒకరు ఎలిమినేషన్ అవుతారంటూ ప్రచారం జరిగింది. అది కూడా టేస్టీ తేజ ఓటింగ్‌లో చాలా వెనుకంజలో ఉన్నాడంట. ఈయనే ఈ వారం ఎలిమినేషన్ అవుతారంటూ వార్తలు వినిపించాయి. కానీ, ఈరోజు మాత్రం మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ వారం కూడా మహిళా కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో ఇప్పటికే నలుగురు మహిళలను హౌస్ నుంచి పంపిన బిగ్ బాస్, మరో లేడీని ఇంటి నుంచి వెళ్లగొట్టడం ఏటంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు.

ముఖ్యంగా టాప్ కంటెస్టెంట్ అనుకున్న లేడీనే ఎలిమినేట్ అవుతుందనే వార్త హాట్ టాపిక్‌‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? అసలు మ్యాటరేంటో ఇప్పుడు తెలుసుకుందాం?

సీరియల్ బ్యాచ్‌పై రిమార్క్..

బిగ్‌బాస్ హౌసులోకి వచ్చిన వారంతా.. ఎవరి గేమ్ వాళ్లు ఆడుతుంటారు. కానీ, ఈసారి మాత్రం అలా జరగడం లేదు. సీరియల్ బ్యాచ్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన బ్యాచ్ అంతా.. కలిసి ఆడుతూ, జనాలకు విసుగు పుట్టిస్తున్నారు. వీరంతా తొలి ఎపిసోడ్ నుంచే కలిసి ప్లాన్ చేస్తూ.. మజా లేకుండా చేస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా.. వీరి తీరు మారడం లేదు. దీంతో ఈ సీరియల్ బ్యాచ్ ఓవరాక్షన్ చూడలేపోతున్నారు జనాలు.

ఐదో వారం ఎలిమినేషన్‌లో ప్రియాంక?

పవర్ అస్త్రం దక్కించుకున్న వారిలో శోభాశెట్టి, సందీప్, ప్రశాంత్ ఉన్నారు. వీరు తప్ప హౌస్‌లో ఉన్న మిగిలిన ఏడుగురు ఐదో వారం నామినేట్ అయ్యారు. ఇక ఓట్ల శాతం చూస్తే.. శుక్రవారం వరకు శివాజీ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. ఆ తర్వాత గౌతమ్, యవర్, శుభశ్రీ, టేస్టీ తేజ ఉన్నారు. ఇక ఎలిమినేషన్ బాటలో అంటే చివరి స్థానాల్లో అమరదీప్, ప్రియాంక ఉన్నారంట.

అయితే, గురువారం వరకు టేస్టీ తేజ చివర స్థానంలో నిలిచాడు. కానీ, కెప్టెన్సీ టాస్క్ సమయంలో తేజకు ఓటింగ్ శాతం భారీగా పెరిగిందంట. ఈక్రమంలో అమరదీప్, ప్రియాంక చివరి స్థానాలకు పడిపోయారు. ఇక వీరిద్దరూ డేంజరస్ జోన్‌లో పడిపోయారు. మరి వీరిలో ఎవరిని బయటకు పంపుతారో చూడాలి. ఓటింగ్ ప్రకారమే అయితే, ప్రియాంక ఇంటి బాట పట్టాల్సిందే. ఏం జరుగుతుందో చూడాలి మరి?

Arun Chilukuri

Arun Chilukuri

Next Story