Madhu Chopra: మొదట ఆ ప్రాజెక్ట్‌కు నో చెప్పింది.. ప్రియాంక చోప్రా తల్లి ఆసక్తికర కామెంట్స్

Priyanka Chopra Mothers Interesting Comments
x

మొదట ఆ ప్రాజెక్ట్‌కు నో చెప్పింది.. ప్రియాంక చోప్రా తల్లి ఆసక్తికర కామెంట్స్

Highlights

ప్రియాంక తల్లి మధు చోప్రా తన కూతురి గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మధు చోప్రా తన కూతురి సినీ కెరీర్ గురించి మాట్లాడారు. తను మొదట ఓ ప్రాజెక్టుకు నో చెప్పిందని తర్వాత బతిమాలి ఒప్పించారంటూ చెప్పారు.

Madhu Chopra: ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియాలో బిజీ అయిపోయారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కించబోతున్న SSMB29లో ప్రియాంక కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. అయితే ప్రియాంక తల్లి మధు చోప్రా తన కూతురి గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మధు చోప్రా తన కూతురి సినీ కెరీర్ గురించి మాట్లాడారు. తను మొదట ఓ ప్రాజెక్టుకు నో చెప్పిందని తర్వాత బతిమాలి ఒప్పించారంటూ చెప్పారు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గతంలో విజయ్ దళపతి సరసన ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. విజయ్‌కు జంటగా తమిజాన్ అనే చిత్రంలో నటించారు. అయితే ఈ ప్రాజెక్టులో నటించేందుకు ప్రియాంక మొదట నో చెప్పిందంట. అయితే మూవీ మేకర్స్ తన భర్తను కలిసి మాట్లాడారని.. దీంతో ఆయన మాట కాదనలేక ప్రియాంక నటించిందని అసలు విషయాన్ని బయట పెట్టారు ప్రియాంక తల్లి మధు చోప్రా.

తమిజాన్ చిత్రం గురించి మాట్లాడిన మధు చోప్రా.. ప్రియాంక మొదట ఆ ప్రాజెక్టుకు నో చెప్పింది. కానీ వారు ప్రియాంక సోదరుడిని కలిశారు. ఆ తర్వాత ఆమె తండ్రిని కలిసి మాట్లాడారు. కేవలం రెండు, మూడు నెలల పాటు వేసవి సెలవుల్లో మా మూవీ షూట్‌కు సమయమివ్వండి అని అడిగారు. వారి మాట కాదనలేక ప్రియాంక చోప్రా తండ్రి ఒప్పుకున్నారు. తండ్రి మాట కోసం ప్రియాంక నటించాల్సి వచ్చిందని చెప్పారు.

విజయ్ అంటే ప్రియాంకకు చాలా గౌరవమన్నారు మధు చోప్రా. విజయ్ చాలా ఓపికతో ప్రియాంకకు సెట్స్‌లో సాయం చేశాడని చెప్పుకొచ్చింది. ప్రభుదేవా బ్రదర్ రాజు సుందరం కొరియోగ్రాఫీలో స్టెప్పులు చాలా కఠినంగా ఉన్నాయి. విజయ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్.. అతనితో డ్యాన్స్ చేసేందుకు ప్రియాంక చాలా కష్టపడిందన్నారు. కొత్త భాష నేర్చుకోవడం, డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్ చేయడంలో విజయ్ చాలా సాయం చేశాడని మధు చోప్రా గుర్తు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories