Madhu Chopra: విడాకుల వార్తలన్నీ పుకార్లే.. క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా తల్లి

* ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ విడాకుల విషయంపై స్పందించిన ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా

Sandeep Reddy
Published on: 23 Nov 2021 4:09 PM IST
Priyanka Chopra Mother Madhu Chopra Clarifies About the Priyanka Chopra Divorce News
X

ప్రియాంక చోప్రా విడాకుల వార్తలన్నీ పుకార్లే.. క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా తల్లి 

Madhu Chopra: ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ త్వరలో విడిపోతున్నారని తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించింది. ప్రియాంక చోప్రా విడాకులపై వస్తుందంతా చెత్త వార్తలని, అలాంటి పుకార్లు ఎవరు నమ్మొద్దని మధు చోప్రా తెలిపింది. ఇలాంటి అసత్యపు వార్తలను ప్రచారం చేయొద్దని మధు చోప్రా మీడియాని కోరింది. ఇటీవల ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా హ్యండిల్స్ నుండి జోనస్ పేరును తీసి వేయడంతో వారిద్దరూ విడిపోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

ప్రియాంక చోప్రా భవిష్యత్‌లో నటించబోయే ప్రాజెక్ట్‌ల కోసమే తన పేరును ఇలా మార్చుకున్నారని తెలిపారు. తన ఖాతాల పేర్లలో నుంచి కేవలం 'జొనాస్‌' పేరు మాత్రమే కాకుండా 'చోప్రా' పేరు కూడా తొలగించిందని తెలిపారు. ఇక హాలీవుడ్ చిత్రం "ది మాట్రిక్స్ రిసరేక్షన్స్" లో కీలక పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించబోతుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story