Priyanka Chopra-Nick: ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్‌ విడిపోతున్నారా..?

*నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారిన న్యూస్ *షాక్‌కు గురైన అభిమానులు, నెటిజన్లు

Shilpa
Updated on: 23 Nov 2021 3:56 PM IST
Priyanka Chopra Dropped her Second Surname Jonas from Instagram and Twitter Accounts
X

ప్రియాంక చోప్రా - నిక్‌ జొనాస్‌ (ఫైల్ ఫోటో)

Priyanka Chopra-Nick: గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా, తన భర్త పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ విడిపోతున్నారా..?. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో ప్రియాంక అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనికి కారణం ప్రియాంక చోప్రా సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ నుంచి తన భర్త ఇంటి పేరు జొనాస్‌ పేరును తొలగించడమే.

ప్రియాంక చోప్రా తాజాగా తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల నుంచి చోప్రా జొనాస్ పేరును తొలగించారు. కేవలం ప్రియాంక పేరుతోనే ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కనిపిస్తున్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో ప్రియాంకపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

Shilpa

Shilpa

Next Story