మహేష్ కోసం యంగ్ హీరోయిన్.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా ?

Priyanka Arul Mohan will Act in Mahesh Babu SSMB28 Movie
x

మహేష్ కోసం యంగ్ హీరోయిన్.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా ?

Highlights

SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతి త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.

SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతి త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. "ఎస్ ఎస్ ఎం బీ 28" అనే వర్కింగ్ టైటిల్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్యారిస్ కి వెకేషన్ కి వెళ్ళిన మహేష్ బాబు ఈ మధ్యనే తిరిగి హైదరాబాద్ కి వచ్చారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. అంతా బాగానే జరుగుతుంది అనుకున్న సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇప్పుడు ఒక ఇబ్బంది వచ్చిపడింది. గత కొంతకాలంగా త్రివిక్రమ్ తన సినిమాలో హీరోయిన్ ల తో పాటు మరొక హీరోయిన్ ని కూడా కీలక పాత్ర ను ఇస్తూ వచ్చారు.

"అత్తారింటికి దారేది" సినిమాలో ప్రణీత, "అరవింద సమేత" సినిమాలో ఈషా రెబ్బా పాత్రలను డిజైన్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం కూడా అలానే ఒక పాత్రనీ రెడీ చేయబోతున్నారట. పూజా హెగ్డే తో పాటు మరొక హీరోయిన్ ఈ సినిమాలో కనిపించబోతోంది. అంతకుముందు "భీమ్లా నాయక్" ఫేమ్ సంయుక్త మీనన్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు వినిపించాయి కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ "గ్యాంగ్ లీడర్" ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ని ఎంపిక చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories