Priyamani: "తనే నా ఆల్టైమ్ ఫేవరెట్ హీరో" అంటున్న ప్రియమణి

Priyamani: "ఎన్టీఆర్ కోసమే సినిమా ఒప్పుకున్నాను" అంటున్న ప్రియమణి

admin1
Updated on: 7 Feb 2022 3:30 PM IST
Priyamani Said that Junior NTR is My All Time Favorite Hero
X

 "తనే నా ఆల్టైమ్ ఫేవరెట్ హీరో" అంటున్న ప్రియమణి

Priyamani: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉండే ప్రియమణి తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తక్కువ కాలంలోనే పెద్ద హిట్ సినిమాలను అందుకుని ముందుకు దూసుకు వెళ్ళింది. జగపతి బాబు, ఎన్టీఆర్, నాగార్జున, ఇలా చాలా మంది హీరోలతో సినిమాలు చేసిన ప్రియమణి ఈ మధ్యనే హిందీ లో "ది ఫ్యామిలీ మ్యాన్" వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. అయితే ప్రియమణి తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో "యమదొంగ" సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని సాధించింది.

కలెక్షన్లతో రికార్డులు సైతం సృష్టించిన ఆ సినిమా గురించి ప్రియమణి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. "యమదొంగ ఆఫర్ వస్తే ఎవరైనా రాజమౌళి డైరెక్టర్ కాబట్టి ఆలోచించకుండానే ఒప్పుకుంటారు. కానీ నేను ఆ సినిమాలో నటించడానికి కారణం ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటన, డాన్స్ నాకు చాలా చాలా ఇష్టం. అలాంటి టాలెంటెడ్ నటుడితో నటించాలని నా కల. అందుకే నేను సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఎన్టీఆర్ అంటే ఇప్పటికి కూడా నాకు చాలా ఇష్టం. తనే నా ఆల్టైమ్ ఫేవరెట్ హీరో" అని చెప్పుకొచ్చింది ప్రియమణి.

admin1

admin1

Next Story