Priyamani: సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొడుతున్న ప్రియమణి

Priyamani: సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొడుతున్న ప్రియమణి

admin1
Published on: 15 Feb 2022 3:39 PM IST
Priyamani has Increased her Remuneration Hugely
X

సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొడుతున్న ప్రియమణి

Priyamani: ఈ మధ్యనే "ది ఫ్యామిలీ మ్యాన్" సిరీస్తో హిందీ ప్రేక్షకులను అలరించిన ప్రియమణి చాలా కాలం తర్వాత తెలుగులో ఒక వెబ్ సిరీస్ లో కనిపించారు. నిన్నమొన్నటిదాకా ఢీ డాన్స్ షో తో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియమణి తాజాగా ఇప్పుడు ఆహా వీడియోలో "భామాకలాపం" అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకులను అలరించిన ఈ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యనే విడుదలైన ఈ వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభించింది.

ఈ నేపథ్యం లోనే ప్రియమణి తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసి నట్లు తెలుస్తోంది. భామాకలాపం వెబ్ సిరీస్ కోసం ప్రియమణి ఒక రోజుకి 1.5 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుందట కానీ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుల కోసం ఒక రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల దాకా ప్రియమణి డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హీరోయిన్ గా సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక ఇంత మంచి విజయాన్ని సాధించడం ఇదే మొదటిసారి. ఈ ఒక్క హిట్ తో ప్రియమణి కి భారీ ఆఫర్లు వచ్చి పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

admin1

admin1

Next Story