Priyadarshi Pulikonda: "బలగం" హీరో డిమాండ్ మామూలుగా లేదుగా..

Priyadarshi Pulikonda: బాగా పెరిగిన ప్రియదర్శి డిమాండ్..

Jyothi
Updated on: 8 April 2023 9:31 PM IST
Priyadarshi Pulikonda Increase Demand Remuneration
X

Priyadarshi Pulikonda: "బలగం" హీరో డిమాండ్ మామూలుగా లేదుగా..

Priyadarshi Pulikonda: టాలీవుడ్ లో ప్రస్తుతం చాలామంది స్టార్ కమెడియన్లు హీరోలుగా కూడా తమ సత్తా చాటుతూ మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ జాబితాలో ప్రియదర్శి కూడా ఒకరు. పెళ్లిచూపులు సినిమాతో బాగా పాపులర్ అయిపోయిన ప్రియదర్శి ఆ తర్వాత హీరోగా కూడా మంచి అవకాశాలు అందుకున్నాడు. ఒకవైపు జాతి రత్నాలు వంటి కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు మల్లేశం వంటి ఎమోషనల్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి. తాజాగా ప్రియదర్శి హీరోగా నటించిన సినిమా "బలగం".

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. నటుడిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు ప్రియదర్శి. అయితే అటు కమెడియన్ వేషాలని నిర్లక్ష్యం చేయకుండా పెద్ద పెద్ద సినిమాలలో కమెడియన్ పాత్రలలో కూడా బాగానే అలరిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ప్రియదర్శి హీరోగా రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బలగం సినిమా కూడా పెద్ద హిట్ అయిపోయేసరికి ప్రియదర్శికి ఉన్న డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో నిర్మాతలు కూడా ప్రియదర్శితో సినిమాలు చేయడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు అని ముందుకు వస్తున్నారు. సునీల్ వంటి కమెడియన్ల లాగా కేవలం హీరో పాత్రలకి మాత్రమే పరిమితం అయిపోయి ఫేడ్ అవుట్ అవ్వకుండా ప్రియదర్శి కమెడియన్ గా కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.

Jyothi

Jyothi

Next Story