Priya Varrier: నా చదువు వల్ల చాలా సినిమాలను వదులుకున్నా

Sandeep Reddy
Updated on: 2 Aug 2021 11:07 AM IST
Priya Varrier Said I Lost Many Big Star Heroes Movie Chances Because of My Studies
X

ప్రియా వారియర్ (ఫైల్ ఫోటో)

Priya Varrier: 17 ఏళ్ళ వయసులో "తనహ" చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మలయాళంలో 2019 లో "ఒరు ఆదార్ లవ్" సినిమాలో తన కను సైగలతో కుర్రకారును ఉర్రూతలూగించిన ప్రియా వారియర్ 18 ఏళ్ళకే హీరోయిన్ గా ఆ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో ఇటీవల విడుదలైన "చెక్" సినిమాలో నితిన్ కి జోడిగా నటించిన ప్రియా తాజాగా తేజ సజ్జ హీరోగా నటించిన "ఇష్క్" సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల ప్రియా వారియర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్లో గత మూడు ఏళ్ళలో కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించడానికి కారణం తన చదువుకి ఇచ్చిన ప్రాధాన్యత వల్లనే అని ప్రియా చెప్పుకొచ్చింది.

స్టార్ హీరోలతో పెద్ద సినిమాలలో నటించడానికి అవకాశం వచ్చిన వాటిని వదులుకున్నానని చదువు అయ్యాకే పూర్తి స్థాయిలో సినిమాల్లో నటిస్తానని ప్రియా తెలిపింది. ఇక తక్కువ కాల్ షీట్స్ తో తాజాగా నటించిన "ఇష్క్" సినిమాలోని తన పాత్రతో ప్రియా పర్వాలేదనిపించింది. ఇక కన్నడ భాషలో ప్రముఖ దర్శకుడు వికే ప్రకాష్ దర్శకత్వంలో "విష్ణుప్రియ" చిత్రంలో యువ హీరో శ్రేయాస్ మంజుకి జోడిగా ప్రియా వారియర్ కన్నడ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story