ISHQ Movie : తేజ సజ్జాతో ప్రియా వారియర్‌ రొమాన్స్

priya prakash varrier Tejasajja
x

  New Movie 𝐈𝐒𝐇𝐐

Highlights

ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన తేజ స‌జ్జా క‌థానాయ‌కుడిగా య‌స్‌.య‌స్‌.రాజు ద‌ర్శక‌త్వంలో ఓ చిత్రం రూపొందనుంది.

ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన తేజ స‌జ్జా క‌థానాయ‌కుడిగా య‌స్‌.య‌స్‌.రాజు ద‌ర్శక‌త్వంలో ఓ చిత్రం రూపొందనుంది. కాగా.. కన్ను గీటిన ఒక్క క్లిప్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన యువ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి 'ఇష్క్' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. 'నాట్ ఎ ల‌వ్ స్టోరీ' అనేది ట్యాగ్‌లైన్‌. దీనికి సంబంధించన పోస్టర్‌ను తేజ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుక్రవారం షేర్ చేశారు.

ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పకులుగా వ్యవ‌హ‌రిస్తుండ‌గా..ప్రతిష్టాత్మక సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్వీ ప్రసాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మించనున్నారు. ఇష్క్ అనే టైటిల్ చూస్తే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అనే అభిప్రాయం క‌లుగుతుంది. అయితే దీనికి ట్యాగ్‌లైన్ 'నాట్ ఎ ల‌వ్ స్టోరీ' మ‌రో అభిప్రాయాన్ని క‌లిగిస్తూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ 2021లో త‌న తొలి చిత్రంతో మళ్లీ తెలుగులోకి వ‌స్తోంది. ఈ చిత్రానికి మ‌హ‌తి స్వర‌ సాగ‌ర్ బాణీలు అందించనుండగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్ చేయనున్నాడు‌. సాహిత్యం శ్రీ‌మ‌ణి అందిచనున్నారు. ఎ. వ‌ర‌ప్రసాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్టర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ప్రియాంక 'ఒరు అదార్ లవ్' అనే మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ప్రియాంక ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెలుగులోకి 'లవర్స్ డే'గా విడుదల చేశారు. సినిమా ఆడకపోయినా ప్రియాంక నటనకు మన కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఆ చిత్రం తర్వాత ప్రియాంకకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు పెరుగుతున్నాయి. నితిన్ చిత్రంల నటిస్తుండగా ఇప్పుడు మరో సినిమా ఛాన్స్ ఆమెను వరించింది. ప్రస్తుతం ప‌లు చిత్రాల‌తో బిజీగా మారిన యంగ్ హీరో తేజ స‌జ్జా. జాంబి జోనర్ వస్తున్న జాంబి రెడ్డి అనే చిత్రంతో తేజా సజ్జా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories