నిత్యానంద స్వామి అంటే చాలా ఇష్టం అంటున్న ప్రియ ఆనంద్

Priya Anand: "నిత్యానంద స్వామి ని పెళ్లి చేసుకుంటాను" అంటున్న హీరోయిన్

Sriveni Erugu
Updated on: 10 July 2022 1:28 PM IST
Priya Anand says that she likes Nithyananda Swami very much
X

"నిత్యానంద స్వామి ని పెళ్లి చేసుకుంటాను" అంటున్న హీరోయిన్

Priya Anand: తమిళ్ నటి ప్రియా ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. లీడర్, 180, రామ రామ కృష్ణ కృష్ణ వంటి సినిమాలలో నటించిన ఈమె చాలాకాలం తర్వాత మళ్లీ సుశాంత్ హీరోగా నటిస్తున్న "మా నీళ్ళ ట్యాంక్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే తాజాగా ఈమె చేసిన షాకింగ్ వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కింది. ఎప్పటినుంచో తన సోషల్ మీడియా వేదికగా నిత్యానంద స్వామి కొటేషన్లు షేర్ చేస్తూ ఉంటుంది ఈ భామ. అయితే తాజాగా ఎందుకు ప్రతిసారి నిత్యానంద స్వామి పోస్టులను షేర్ చేస్తూ ఉంటారు అని అడగగా ప్రియ ఆనంద్ ఒక షాకింగ్ జవాబు ఇచ్చారు.

"నాకు నిత్యానంద స్వామి అంటే చాలా ఇష్టం. ఎన్నో వివాదాలలో ఇరుక్కున్నప్పటికీ ఆయన చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కుదిరితే నాకు ఆయనని పెళ్లి చేసుకోవాలని ఉంది. మా ఇద్దరి పేర్లలో ఆనంద్ కామన్ గా ఉంది కాబట్టి నేను పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు," అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది ప్రియా ఆనంద్. ఈమె కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిత్యానంద స్వామి ఇప్పటికే ఎన్నో రేపు కేసులలో, సెక్స్ స్కాండల్స్ లో ఇరుక్కున్న సంగతి తెలిసింది. అలాంటిది అతనిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈ భామ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story