"సలార్" లో విలన్ గా మలయాళం స్టార్

Prithviraj Sukumaran Will Be The Part Of Salaar
x

"సలార్" లో విలన్ గా మలయాళం స్టార్

Highlights

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమా భారీ అంచనాల మధ్య మార్చ్ 11 న విడుదల కానుంది.

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమా భారీ అంచనాల మధ్య మార్చ్ 11 న విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సలార్". కే జి ఎఫ్ సినిమా ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య విలన్ పాత్రలో కనిపించబోతున్నరట. ఇక "బాహుబలి" సినిమా లాగానే "సలార్" కూడా రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలసిందే. ఈ సినిమా కథని ఒక భాగంలో చెప్పే కంటే రెండు భాగాలుగా తీస్తే బావుంటుంది అని దర్శక నిర్మాతలు అనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందుర్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. జగపతి బాబు, ఈశ్వరి రావు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories