Prithviraj Sukumaran : బిస్కెట్ కింగ్ గా మారనున్న పృథ్వీరాజ్

భారతదేశపు బిస్కెట్ కింగ్ ఆధారంగా పృథ్వీరాజ్ వెబ్ సిరీస్

admin1
Updated on: 1 Dec 2021 4:36 PM IST
Prithviraj Sukumaran to Play Indias Biscuit King of India Rajan Pillai in Hindi Web Series | Cinema News Today
X

భారతదేశపు బిస్కెట్ కింగ్ ఆధారంగా పృథ్వీరాజ్ వెబ్ సిరీస్ (ఫైల్ ఫోటో )

Prithviraj Sukumaran - "Biscuit King of India" Rajan Pillai Web Series: మలయాళంలో స్టార్ హీరోగా ఎదిగిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ భారతదేశపు బిస్కెట్ కింగ్ అయిన రాజన్ పిళ్ళై జీవిత చరిత్ర ఆధారంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ బిస్కెట్ కింగ్ గా కనిపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం రాజన్ పిళ్ళై జీవితం ఆధారంగా ఉండబోతోంది. ఆయన కెరీర్లో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను కూడా ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నారు.

యూడుల్ ఫిలింస్ వారు ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ కి దర్శకుడు మరెవరో కాదు పృథ్వీరాజ్ సుకుమారన్. స్వయంగా దర్శకత్వం వహించనున్నారు పృథ్వీరాజ్. ఇంతకుముందు పృధ్విరాజ్ దర్శకత్వం వహించిన "లూసిఫర్" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు షాజీ కైలాస్ దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతోంది.

admin1

admin1

Next Story