Bigg Boss 7 Telugu: గ్రాండ్ ఫినాలే నుంచి మూడో ఎలిమినేషన్.. రూ. 15 లక్షలతో బయటికొచ్చిన యావర్..?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఫైనల్ అన్నపూర్ణ స్టూడియోలు జరుగుతోంది.

Arun Chilukuri
Published on: 16 Dec 2023 7:19 PM IST
Prince Yawar Eliminated From Bigg Boss 7 Telugu Finale With 15 Lakhs Cash Prize
X

Bigg Boss 7 Telugu: గ్రాండ్ ఫినాలే నుంచి మూడో ఎలిమినేషన్.. రూ. 15 లక్షలతో బయటికొచ్చిన యావర్..?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఫైనల్ అన్నపూర్ణ స్టూడియోలు జరుగుతోంది. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇప్పటికే అర్జున్, ప్రియాంక ఎలిమినేషన్ అయ్యారు. కాగా, నాలుగో స్థానంలో నిలిచిన యావర్ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడంట. ఈ క్రమంలో యావర్‌కు బిగ్ బాస్ ఓ ఆఫర్ కూడా ఇచ్చాడంట. గేమ్‌లో ఉండడమా.. లేక రూ. 15 లక్షల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేయడమా అనే ఆఫ్షన్స్ యావర్ ముందు ఉంచాడంట బిగ్ బాస్. అయితే, యావర్ మాత్రం రూ. 15 లక్షల క్యాష్ తీసుకుని బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడంట.

ఈ మేరకు సోషల్ మీడియా యావర్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మంచి పని చేశావంటూ, లేదంటే ఖాళీ చేతులతో ఎలిమినేట్ అయ్యేవాడవంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా గ్రాండ్ ఫినాలే నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మరో ముగ్గురు ఫైనల్ రేసులో ఉన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story