Mahesh Babu: మే 31న సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేస్తున్న ప్రిన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Venkata Chari
Published on: 21 May 2021 6:03 PM IST
Prince Mahesh Babu Planning Back-to-back Surprises For His Fans | Tollywood Updates Today
X

మహేష్ బాబు (ఫొటో ట్విట్టర్)

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రిన్స్ తన పైప్‌లైన్‌లో అధిక-బడ్జెట్ ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నాడు. ఈమేరకు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31 న ఫ్యాన్స్‌‌కు గుర్తుండిపోయేలా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‎మహేష్ బాబు తన తదుపరి సినిమాలపై అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడంట.

పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు రాబోయే చిత్రం 'సర్కారు వారి పాట' నుంచి కొత్త పోస్టర్ లేదా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో చేతులు కలపబోతున్నాడు. మే 31 న ఈ ప్రాజెక్ట్ పై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు రాబోయే సినిమాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

మొత్తానికి ఫ్యాన్స్‌ను బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌ డేట్స్‌తో ఆశ్చర్యపరిచనుండడంతో.. అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తరువాత నూతన ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story