Prashanth Neel: రోజు రోజుకి ప్రశాంత్ నీల్ పై పెరుగుతున్న ప్రెజర్...

Prashanth Neel: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు...

Shireesha
Updated on: 22 April 2022 2:41 PM IST
Pressure Increasing in Prashanth Neel about Prabhas Salaar Movie | Tollywood News
X

Prashanth Neel: రోజు రోజుకి ప్రశాంత్ నీల్ పై పెరుగుతున్న ప్రెజర్...

Prashanth Neel: "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమాతోనే రికార్డు బద్దలు కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా తో మరొకసారి ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. యశ్ హీరోగా నటించిన "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ప్రస్తుతం అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "సలార్". యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొట్టమొదటి సినిమా ఇది. "కే జి ఎఫ్" సినిమాలో ప్రేక్షకులకు బాగా నచ్చిన ఎలిమెంట్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్లు. ఇక ప్రభాస్ అభిమానులు కూడా అదే రేంజ్ ఎలివేషన్ లను "సలార్" సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పైగా ప్రభాస్ హీరోగా నటించిన "రాధేశ్యామ్" సినిమా డిజాస్టర్ అవడంతో "సలార్" సినిమా హిట్ అవ్వడం ప్రభాస్ కెరియర్ కు ఎంతో ముఖ్యం.

ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఇప్పుడు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం అవుతోంది. నిర్మాతలు ఈ సినిమాపై భారీ మొత్తాన్ని ఖర్చుపెట్టారు. ఈ నేపథ్యంలో "సలార్" సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రశాంత్ నీల్ పై భారీ ప్రెజర్ ఏర్పడుతోంది. మరి ఈ ప్రెజర్ ని తట్టుకొని ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుస్తారా లేదా అని ఇంకా తెలియాల్సి ఉంది.

Shireesha

Shireesha

Next Story