Preetham Jukalker: సమంతని సిస్టర్ లా భావించా.. ఈ విషయం చైతూకి కూడా తెలుసు

* సమంతని సిస్టర్ అంటూ పిలిచేవాడిని: ప్రీతమ్

Sandeep Reddy
Updated on: 11 Oct 2021 2:40 PM IST
Preetham Jukalker Says I Treat Samantha Like Sister and Naga Chaitanya also Know This
X

Preetham Jukalker: సమంతని నేను అక్కలాగా భావించా.. ఈ విషయం చైతూకి కూడా తెలుసు

Preetham Jukalker - Samantha: సమంత - నాగచైతన్యల మధ్య ఉన్న ఇన్నేళ్ళ వైవాహిక బంధం విడాకులతో ముగిసి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా ఆ వేడి సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గడంలేదు. సమంత చేసిన తప్పుల వల్లే వారి బంధం విడాకుల వరకు వెళ్లిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేయడం చూశాము. డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ తో సన్నిహితంగా ఉందంటూ వారిద్దరికీ అనవసరమైన సంబంధాలను అంటగడుతూ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై ప్రీతమ్ జుకాల్కర్ స్పందించాడు.

తనకి సమంతకి మధ్య అక్క తమ్ముళ్ళ అనుబంధం మాత్రమే ఉందని తనని నేను జిజి (సిస్టర్) అని పిలుస్తానని., ఈ విషయం అక్కినేని నాగచైతన్యకి కూడా తెలుసని చెప్పుకొచ్చాడు. నాకు సమంతకి మధ్య సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై నాగచైతన్య మాట్లాడి నెటిజన్లకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రీతమ్ జుకాల్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా తను సమంత పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలో జిజీ అంటూ పిలిచిన పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు జుకాల్కర్. అనవసరంగా లేనిపోని అవాస్తవాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి తమని మానసికంగా ఇబ్బందులకు గురి చేయవద్దని నిజం తెలుసుకొని మాట్లాడాలంటూ చెప్పుకొచ్చాడు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story