Preetham Jukalker: మళ్ళీ వచ్చాడు.. చిరు కూతురి ఫోటోపై ప్రీతమ్ షాకింగ్ కామెంట్

Sandeep Reddy
Updated on: 19 Nov 2021 2:03 PM IST
Preetham Jukalker Comment on Chiranjeevi Daughter Sreeja Kalyan Birthday Post in Instagram
X

Preetham Jukalker: చిరంజీవి కూతురి ఫోటోకి ప్రీతమ్ జుకాల్కర్ షాకింగ్ కామెంట్

Preetham Jukalker: సమంత - నాగచైతన్య విడాకులకు ఇతడే కారణమంటూ కొద్దిరోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో మారుమ్రోగిన పేరు ప్రీతమ్ జుకాల్కర్. ఈ స్టైలిస్ట్ వల్లే సమంత విడాకులు తీసుకుందని, వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు చూసి అటు అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లు ప్రీతమ్ జుకాల్కర్ పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత సమంత నా సిస్టర్ అని ఆ విషయం నాగచైతన్య కూడా తెలుసు అని క్లారిటీ ఇచ్చిన ప్రీతమ్ తాజాగా మెగా డాటర్ శ్రీజ చేసిన పోస్ట్ కు చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తన ఫొటోతో తాజాగా ఒక పోస్ట్‌ ను షేర్‌ చేసింది. ఈ పోస్ట్ కి గానూ ప్రీతమ్ "సుందర్ లడికీ"(అందమైన అమ్మాయి) అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు ప్రీతమ్. అయితే నెటిజన్లు మాత్రం స్టైలిస్ట్ గా ఉన్న ప్రీతమ్ కు మెగా ఫ్యామిలీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని అందుకే అలా కామెంట్ చేశాడని అభిప్రాయపడ్డారు.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story