'చిత్రలహరి' ప్రీ రిలీజ్ బిజినెస్ జోరు అందుకోవడానికి కారణం అదేనా

వరుసగా రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తగిలితేనే మార్కెట్ బీభత్సంగా పడిపోయిన హీరోలను చాలా మందిని చూశాం కానీ వరుసగా...
వరుసగా రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తగిలితేనే మార్కెట్ బీభత్సంగా పడిపోయిన హీరోలను చాలా మందిని చూశాం కానీ వరుసగా ఆరు డిజాస్టర్లు చవిచూసినప్పటికీ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రం అయిన 'చిత్రలహరి' మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దానికి కారణం ఈ చిత్ర టీజర్ అనే చెప్పుకోవచ్చు. కిషోర్ తిరుమల దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదల అయింది. కేవలం నిమిషం నిడివి గల ఈ వీడియో కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ అందింది.
ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే తీరుతుందని టీజర్ చెప్పకనే చెబుతోంది. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరందుకుంది. నివేదా పేతురాజ్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. అయితే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటిదాకా సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించని వారు కూడా ఇప్పుడు సినిమా రైట్ల కోసం క్యూ కడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. చూస్తూ ఉంటే మెగా మేనల్లుడు ఈ సారి కచ్చితంగా హిట్ అందుకునే లాగానే ఉన్నాడు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT