Prashanth Varma: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ

Prashanth Varma: ప్రస్తుతం టాలెంటెడ్ యువ దర్శకుల జాబితాలో ప్రశాంత్ వర్మ పేరు కూడా ముందే ఉంటుంది.

admin1
Updated on: 12 Oct 2021 10:00 PM IST
Prashanth Varma Directing Nandamuri Balakrishna
X

Prashanth Varma: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ

Prashanth Varma: ప్రస్తుతం టాలెంటెడ్ యువ దర్శకుల జాబితాలో ప్రశాంత్ వర్మ పేరు కూడా ముందే ఉంటుంది. ఆసక్తికరమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించడంలో ముందున్నాడు ప్రశాంత్ వర్మ. ఒకవైపు సినిమాలకు మాత్రమే కాక మరో వైపు యాడ్ ఫిల్మ్స్ కి కూడా ప్రశాంత్ వర్మ ని కూడా దర్శకుడిగా ఎన్నుకుంటున్నారు. బిగ్బాస్ సీజన్ 5 మొదలు అవకముందు ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో కి దర్శకత్వం వహించింది కూడా ప్రశాంత్ వర్మ నే. అప్పట్లో ఆ ప్రోమో బిగ్ బాస్ కి బాగానే హైప్ ఇచ్చింది. ప్రశాంత్ వర్మ వర్క్ తో బాగా ఇంప్రెస్ అయిన ఆహా వీడియో తాజాగా ఇప్పుడు ఒక టాక్ షో కి దర్శకత్వం వహించడం కోసం ప్రశాంత్ వర్మ ని ఎంపిక చేసుకున్నారు.

ఆ టాక్ షో వ్యవహరించనుంది మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. సీనియర్ హీరో బాలయ్య "అన్‌స్టాపబుల్" అనే ఒక సెలబ్రిటీ టాక్ షో తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "అన్‌స్టాపబుల్" ప్రోమో కి సంబంధించిన షూటింగ్ జరిగింది. ఆ టాక్ షో ప్రోమో కి దర్శకత్వం వహించింది కూడా ప్రశాంత్ వర్మనే. ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అనే క్యాప్షన్ తో త్వరలోనే ఆహా యాప్ లో విడుదల కాబోతుంది. ఇక సినిమాల పరంగా చూస్తే తేజ సజ్జ హీరో గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "హను మ్యాన్" అనే మొట్టమొదటి తెలుగు సూపర్ హీరో సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు ప్రశాంత్ వర్మ.

admin1

admin1

Next Story