Prashanth Neel: సలార్ ప్రపంచం ఇలా ఉండబోతోంది అంటున్న ప్రశాంత్

Prashanth Neel: సలార్ ప్రపంచం వైలెంట్ గా మార్చాను అంటున్న డైరెక్టర్

admin1
Published on: 15 Nov 2021 5:53 PM IST
Prashanth Neel Says About Salaar Movie
X
సాలార్ మూవీ ఎలా ఉండబోతుందో చెప్పిన ప్రశాంత్ నీల్ (ఫైల్ ఇమేజ్)

Prashanth Neel: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే "రాధే శ్యామ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రభాస్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

"నా ఉద్దేశం ఇంతకంటే విలన్ ని ఎంత స్ట్రాంగ్ గా చూపిస్తే హీరోయిజం కూడా అంతే స్ట్రాంగ్ గా చూపించగలను అని నేను నమ్ముతాను. అందుకే ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండే ఒక వర్ల్డ్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తాను. సలార్ సినిమా విషయంలో మాత్రం విలనిజాన్ని కూడా ఆ రేంజిలో చూపించలేను ఇటు హీరోయిజం కూడా ఆ లెవెల్ కి తీసుకు వెళ్ళలేను. అందుకే ఈ ప్రపంచాన్ని చాలా వైలెంట్ గా మార్చాను" అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

admin1

admin1

Next Story