ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్న ప్రశాంత్ నీల్

Prashanth Neel: తాజాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ తన రెండవ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే

Dhatripriya
Published on: 31 Dec 2022 3:31 PM IST
Prashanth Neel Is Bringing Bollywood Actor For NTR
X

ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్న ప్రశాంత్ నీల్

Prashanth Neel: "కేజిఎఫ్" చాప్టర్ వన్ మరియు చాప్టర్ 2 సినిమాలతో ప్రశాంత్ నీల్ పేరు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయిన సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమా ఫ్రాంచైజ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కన్నడ సినిమా అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా ప్రశాంత్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ ఆమిర్ ఖాన్ కూడా కీలకపాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి ఆపోజిట్ గా ఆమిర్ ఖాన్ అయితే బాగుంటుందని ప్రశాంత్ ఆమిర్ ను సంప్రదించగా ఆమిర్ ఖాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ బాహుబలి స్టార్ ప్రభాస్ తో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు. "సలార్" అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులతో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ సినిమా గురించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story