అనంత్ నాగ్ పాత్ర పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

*అనంత్ నాగ్ పాత్ర పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

admin1
Published on: 13 April 2022 5:00 PM IST
Prashanth Neel Gives Clarity on the Role of Anant Nag | Telugu Movie News
X

అనంత్ నాగ్ పాత్ర పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Prashanth Neel: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన "కే జి ఎఫ్ చాప్టర్ 1" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా కి సీక్వెల్ గా "కే జి ఎఫ్ చాప్టర్ 2" అనే టైటిల్ తో ప్రశాంత్ నీల్ మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇంతకుముందు అనంత్ నాగ్ ను ఎంపిక చేసిన దర్శక నిర్మాతలు ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్ ని తీసుకువచ్చారని కొందరు అనుకున్నారు. మరికొందరు మాత్రం ప్రకాష్ రాజ్ ఆనంద్ వాసి రాజా గా చిన్నప్పటి పాత్ర పోషించారని వార్తలు వినిపించాయి. తాజాగా దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్.

ఒక సీనియర్ నటుడు ప్రాజెక్ట్ నుంచి తనంతట తానుగా బయటకు వెళ్లారని అది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయం అని అన్న ప్రశాంత్ నీల్ దానివల్ల ఆయన చాలా నిరాశకు గురయ్యారని తన సినిమాలో నటించమని ఎవరిని బలవంతం చేయలేదని పేర్కొన్నారు ప్రశాంత్. ఇక అనంత నాగ్ స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో ప్రకాష్ రాజ్ వచ్చినట్టుగా ఇన్డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్.

admin1

admin1

Next Story